: 270 కోట్ల మోసగాడు జాన్ ప్రభాకర్ భార్య అరెస్టు
క్రైస్తవత్వం ముసుగులో 270 కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేసిన హిమ్ సంస్థ వ్యవస్థాపకుడు జాన్ ప్రభాకర్ భార్య సుకన్యను నెల్లూరులో పోలీసులు అరెస్టు చేశారు. హిమ్ సంస్ధకు కోశాధికారిగా ఆంధ్రా, చెన్నై, కర్ణాటకలలో విధులు నిర్వహిస్తున్న సుకన్యను 270 కోట్ల మోసం కేసులో అరెస్టు చేసినట్టు నెల్లూరు పోలీసులు తెలిపారు. భార్యాభర్తలిద్దరూ కూడబలుక్కునే ఈ మోసానికి పాల్పడ్డారని, అమాయకులైన ప్రజలను మతం ముసుగులో మాయ చేసారని బాధితులు ఆందోళనలు చేసారు.