: ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం?: హనుమన్న విస్మయం
తెలంగాణ జిల్లాల్లో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తనదైన శైలిలో స్పందించారు. ఇదేమి రాజ్యమంటూ.. బైండోవర్ కేసులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం పోలీస్ రాజ్యం నడుస్తోందని భాష్యం చెప్పారు. ఏదేమైనా, సర్కారు అనుమతివ్వకున్నా చలో అసెంబ్లీ కార్యక్రమం విజయవంతం అయిందని ఆయన అభిప్రాయపడ్డారు.