: టీడీపీ నేతల సందట్లో సడేమియా
టీడీపీ అందరికీ షాక్ ఇచ్చింది. చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పకపోయినప్పటికీ, చివరి నిమిషంలో అనూహ్యంగా రంగప్రవేశం చేసింది. టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, మరో ముఖ్యనేత కొత్తకోట దయాకర్ తో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముట్టడికి యత్నించి అరెస్టయ్యారు. వీరందరూ అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద ఆందోళనకు దిగడంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని అక్కడినుంచి తరలించారు.