: 'తెలంగాణ' ఎఫెక్ట్ అంటే ఇదే మరి!
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు మధ్య విభేదాలున్న విషయం అందరికి తెలిసిన విషయమే. ఆయన ఉన్న సభలో ఈయనుండరు, ఈయన హాజరైన సభకు ఆయన గైర్హాజరవుతారు. ఒకవేళ ఇద్దరూ తప్పనిసరిగా ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి వస్తే.. ఒకరిపై ఒకరు కావాల్సినన్ని సూటిపోటీ మాటలు అనుకుని సంతృప్తినొందుతారు. అలాంటి వీరిద్దరూ ఒకే వాహనంలో ప్రయాణించడం ఆశ్చర్యమేకదూ. కానీ, చలో అసెంబ్లీ ఎఫెక్ట్ ఇక్కడ ఆ పనిచేసి చూపింది.
అసెంబ్లీ ముట్టడి సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో శాసనసభ నుంచి వీరిద్దరూ ఒకే వాహనంలో వెళ్ళాల్సి వచ్చింది. ఆ వాహనం రాజనర్సింహది కావడం గమనార్హం. తెలంగాణ వాదులు అడ్డుకుంటారన్న భయంతో.. వెంట కాన్వాయ్ కూడా లేకుండా ఈ ముఖ్యోపముఖ్యమంత్రులు అసెంబ్లీ నుంచి జారుకున్నారు.