: గల్ఫ్ బాధితులకు సీఎం పరామర్శ
గల్ఫ్ దేశాలలో నానా కష్టాలు పడ్డ 17 మంది తెలుగు వారు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ ఉదయం మాతృ భూమికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వీరిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న వారిని దశల వారీగా రాష్ట్రానికి తీసుకువస్తామని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు చెప్పారు. ఇప్పటి వరకూ 1000 మంది ప్రభుత్వ సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీసా గడువు ముగిసి అక్కడి జైళ్లలో మగ్గుతున్న తెలుగు వారిని విడిపించి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.