: బరువు తగ్గాలనుకుంటే ఇలాచేస్తే సరి!
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా... అయితే సూ ధామ్సన్‌ను ఫాలో అయిపోండి. ఎంచక్కా బరువు తగ్గేస్తారు. ఒకప్పుడు ధామ్సన్ భారీకాయంతో ఉండేది. ఎంతలా అంటే 171.45 కేజీల బరువు. ఈ భారీ కాయంతో పాపం నిద్రపోవాలన్నా... విమానం ఎక్కాలన్నా కూడా చాలా భయపడేదట. ఇంత బరువుతో ఎక్కడ చనిపోతానో అని తెగ భయపడేదట. ఇంత బరువున్న బండ ధామ్సన్ ఇప్పుడు చక్కగా మెరుపుతీగలాగా తయారయ్యింది.
171.45 కేజీల బరువుండే ధామ్సన్ ఒక్కసారిగా 68.85 కేజీల బరువుకు వచ్చింది. అయితే ఇదేమీ మాయా మంత్రం కాదు... ఇలా ఒక్కరోజులోనో... వారం రోజుల్లోనో బరువు తగ్గేయడానికి! తన కుమార్తె, భర్తకోసం బరువు తగ్గాలనుకుందట. ఇంకేం... చక్కగా తన ఆహారంలో నియమాలను పాటించింది. తదనుగుణంగా వ్యాయామాలు చేయడం ప్రారంభించింది. ఈ విషయం గురించి సూ థామ్సన్ మాట్లాడుతూ తిండిపై ధ్యాస తగ్గించుకుని, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ, ఎప్పుడూ ఇంట్లో తాజాగా వండిన ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తిన్నానని, ఇప్పుడు తన అందం ముందు తన కుమార్తె అందం కూడా దిగదుడుపేనంటూ వయ్యారాలు పోతోంది.