: నిజాం కళాశాల హాస్టల్ ఖాళీ


రేపు జరుగునున్న ఛలో అసెంబ్లీ సందర్భంగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు అడుగడుగూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ నిజాంకాలేజీలో బహిరంగ సభకు అనుమతి ఇవ్వండి అంటూ కోరడంతో అందుకు ముందస్తు చర్యలను పోలీసులు తీసుకుంటున్నారు. అందులో భాగంగా బషీర్ బాగ్ లో ఉన్న నిజాం కళాశాల వసతి గృహాన్ని ఖాళీచేయించారు. మరిన్ని చర్యలు తీసుకునేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు.

  • Loading...

More Telugu News