: 'ఛలో అసెంబ్లీ' దెబ్బకు రవాణా ఇబ్బందులు
ఛలో అసెంబ్లీ కారణంగా నగరవాసులతో పాటు దూర ప్రాంతాల నుంచి నరగానికి రానున్న వారు రవాణా ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఛలో అసెంబ్లీ సందర్బంగా కొన్ని రైలు సర్వీసులను రద్దుచేశారు. ఫలక్ నుమా-సికింద్రాబాద్, లింగంపల్లి-హైదరాబాద్, ఫలక్ నుమా-సికింద్రాబాద్, బొల్లారం-సికింద్రాబాద్, ఎంఎంటీఎస్ డెమో సర్వీసులు రద్దయ్యాయి. లింగంపల్లి-సికింద్రాబాద్ మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయి. బొల్లారం-హైదరాబాద్, తాండూర్-హైదరాబాద్ పాసింజర్ రైళ్లను రద్దు చేశారు. హైదరాబాద్-తాండూర్, వరంగల్-హైదరాబాద్, మిర్యాలగూడ-కాచిగూడ డెమోలు కూడా రద్దయ్యాయి. ముంబై-హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్, బీదర్-హైదరాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లు లింగంపల్లిలో నిలిపేస్తారు. త్రివేండ్రం-హైదరాబాద్ శబరి ఎక్స్ ప్రెస్ ను సికింద్రాబాద్ లో నిలిపేయనున్నారు.