: 'ఛలో అసెంబ్లీ' కారణంగా మద్యం దుకాణాలు బంద్
ఛలో అసెంబ్లీ దెబ్బ మందుబాబులకు తగిలింది. నగరంలో పలు ఆంక్షలు విధించిన పోలీసుశాఖ తాజాగా మరో కొత్త ఆంక్షను విధించింది. హైదరాబాదు, సైబరాబాద్ పరిధిలో పూర్తి స్థాయిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ తెలిపారు. సైబరాబాద్ పరిధిలో 58 చోట్ల, హైదారాబాద్ లో 17 చోట్ల పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం ఉదయం వరకూ జంటనగరాల్లోని అన్ని మద్యం దుకాణాలు మూసివేయిస్తున్నారు. దీంతో మందు బాబులకు గొంతులు పిడచకట్టుకుపోనున్నాయి!