: 105 సార్లు రక్తం దానం చేసిన వ్యక్తికి సన్మానం
దానాల్లోకెల్లా రక్తదానం విలువైనది అన్న విలువైన సూత్రాన్ని బలంగా నమ్మి 105 సార్లు రక్తం దానంచేసిన యోగేష్ రాజ్ శ్రీవాస్తవను ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ అభినందించారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో యోగేష్ రాజ్ కు సన్మానం చేసి వండర్ రికార్డ్ సర్టిఫికేట్ అందజేశారు. ఈ సందర్భంగా మూడు నెలలకోసారి రక్తం దానం చెయ్యడం ద్వారా అనారోగ్యం చెంతచేరదని యోగేష్ తెలిపారు. పోలీస్ సంక్షేమ విభాగం ఐజీ సౌమ్యామిశ్రా మాట్లాడుతూ ప్రధానంగా యువత రక్తం దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.