: సూర్య దేవాలయంలో వైభవంగా రథసప్తమి ఉత్సవాలు
శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లిలోని సూర్య దేవాలయంలో సూర్యభగవానుడి జయంతి, రథసప్తమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అర్చక స్వాముల బృందం స్వామి వారి మూల విరాట్టును పాలతో అభిషేకం చేసింది. ఈ సందర్భంగా సూర్య భగవానుడిని దర్శించుకోవడం కోసం సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు