: పిట్ట కొంచెం కూత ఘనం... బుడతడి రికార్డు
పిట్టకొంచెం కూత ఘనం అనే సామెతను అక్షరాలా నిజంచేసాడీ బుడతడు. ఈతలో ప్రపంచ రికార్డు సృష్టించి, పిల్లాడా మజాకా? అనిపించాడు. బండి ఆత్మకూరు మండలం వెంగల్ రెడ్డిపేటకు చెందిన మద్దలేటి, ప్రమీలల ఆరేళ్ల కుమారుడు మహేష్... వెలుగోడు జలాశయంలో నాలుగు గంటల్లో పది కిలోమీటర్లు ఈతకొట్టి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు లిఖించుకున్నాడు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షుడు చింతపట్ల వెంకటాచారి మాట్లాడుతూ తాము 14 దేశాల్లో రికార్డులు నమోదు చేస్తామని ఇప్పటివరకూ ఇటువంటి రికార్డు ఎక్కడా నమోదు కాలేదని తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ ని అభినందించి ధృవీకరణ పత్రం అందజేశారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో మహేష్ కు ఏ రకమైన సహాయం కావాలన్నా చేస్తామని తెలిపారు.