: దాయాదుల పోరు హుషారు.. ఏదీ.. ఎక్కడా!?


భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కనిపించే క్రికెట్ స్పర్థ మరే ఇతర జట్ల నడుమ ఉండదంటే అతిశయోక్తికాదేమో. ఈ రెండు జట్లు తలపడితే అంతటి ఉత్కంఠ నెలకొంటుంది. కొదమసింహాలు క్రికెట్ బరిలో దిగాయా అన్నంతగా ఆటగాళ్ళలో సీరియస్ నెస్ తాండవిస్తుంది. అత్యధిక సందర్భాల్లో చివరి బంతి సైతం నిర్ణాయకంగా మారి దాయాదుల పోరు మజా అంటే ఏంటో అభిమానులకు రుచి చూపిస్తుంది. అది ప్రపంచకప్ వేదిక అయితే, ఇక చెప్పేదేముంది? నరాలు తెగిపడతాయి, రక్తం పిచ్చిపిచ్చిగా పరుగులు తీస్తుంది! బంతిబంతికి బీపీ స్థాయిల్లో మార్పు కనిపిస్తుంది! చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటే ఇంతకంటే తక్కువ చేసి చెప్పలేం. కానీ, చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో ఈ ఇరుగుపొరుగు దేశాలు ఒకే గ్రూపులో ఉన్నా.. ఈసారి మాత్రం ఆ రోమాంఛక వాతావరణం కనిపించడంలేదు. కారణం.. సుస్పష్టం!

గ్రూప్-బిలో ఉన్న భారత్ తొలి రెండు లీగ్ మ్యాచులలో నెగ్గి సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా.. పాకిస్తాన్ జట్టు వరుసగా రెండు పోటీల్లో ఓటమిపాలై టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. దీంతో, ఎల్లుండి ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కాస్తా అప్రాధాన్య పోరుగా మారింది. ఈ నేపథ్యంలో, అభిమానుల్లోనూ ఈ మ్యాచ్ పట్ల పెద్దగా ఆసక్తి కనబబడడంలేదు. ఇక పెద్దగా ప్రభావం ఉండని మ్యాచ్ అనుకున్నాడో ఏమో వరుణుడు మాత్రం తన ప్రభావం చూపేందుకు పొంచి ఉన్నాడు. పోరుకు వేదికైన బర్మింగ్ హామ్ లో శనివారం వర్షం కురిసే అవకాశముందని అక్కడి వాతావరణ శాఖ ప్రకటించింది.

  • Loading...

More Telugu News