: రైలుపై మావోల మూకుమ్మడి దాడి
మావోయిస్టులు విజ్రంభిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ ఘటన తరువాత దేశవ్యాప్తంగా ఎక్కడపడితే అక్కడ దాడులకు తెగబడుతున్నారు. గతంలో ఒక వర్గాన్ని టార్గెట్ చేసిన మావోలు తాజాగా రూటు మార్చి సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నిన్న మహారాష్ట్రలో ముగ్గురు ఆంధ్రులతో పాటు ఐదుగుర్ని పొట్టనబెట్టుకున్న మావోలు నేడు బీహార్లో ధన్ బాద్ పాట్నా ఎక్స్ ప్రెస్ పై దాడికి దిగారు. సుమారు వందమందికి పైగా మావొలు పాల్గొన్న ఈ దాడిలో రైలు డ్రైవర్ సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఘటనలో రాత్రి ఛత్తీస్ గఢ్ దండకారణ్యంలోని మావోల శిక్షణా శిబిరంపై సీఆర్పీఎఫ్ జవాన్లు దాడి చేసారు. అర్ధ రాత్రి వరకూ కాల్పులు జరిగాయి. ప్రాణనష్టం సంగతి ఇంకా తెలియలేదు.