: 'రూపాయి'పై స్పందించిన చిదంబరం
రూపాయి పతనం విషయంలో అనవసర ఆందోళన అవసరం లేదంటున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం. ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణ వన్డే క్రికెట్ మ్యాచ్ లాంటిది కాదని గురువారం న్యూఢిల్లీలో అభిప్రాయపడ్డారు. కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయాలని ప్రభుత్వ శాఖలను కోరామని తెలిపారు. 9 నెలల క్రితం తీసుకున్న పునరుద్ధరణ చర్యల వల్ల నేడు మంచి ఫలితాలు అందుతున్నాయన్నారు. జూన్ మాసంలో మరిన్ని సంస్కరణలను అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ద్రవ్యలోటు, రెవెన్యూ లక్ష్యాలను సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రూపాయి పతనంపై ఆందోళన అవసరం లేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉందని, అలాగే ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందనీ అన్నారు. విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవడం తగ్గిందని, ఇది మరింత తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.