: కీటకాలు నిరోధకతను పెంచుకుంటున్నాయి!


కీటకాలు పంటలను ఆశిస్తున్నాయి... పంటను పాడుచేస్తున్నాయి... దీంతో రైతులు ఎక్కువ నష్టపోతున్నారు. ఈ నేపధ్యంలో జన్యు మార్పిడి పంటలను తయారు చేశారు శాస్త్రవేత్తలు. ఈ పంటలను కీటకాలు ఎక్కువగా ఆశించవని భావించారు. అయితే ఈ ఆనందం కొంతకాలం మాత్రమే... ఇప్పుడు ఈ జన్యు మార్పిడి పంటలకు పురుగులు, ఇరత పంటలను ఆశించే కీటకాలు కూడా నిరోధకతను పెంపొందించుకున్నాయట. ఈ విషయం ఒక తాజా అధ్యయనంలో వెల్లడయింది. జన్యుమార్పిడి పంటలను వేసినంత మాత్రాన సరిపోదు... ఆ పంటలను చీడ, పీడలనుండి కాపాడుకునేందుకు పంట సాగులో ప్రత్యేకమైన వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంది. ఇలాంటి ప్రత్యేకమైన వ్యూహాలను అనుసరించకపోవడం, ఇతర జాగ్రత్తలను పాటించకపోవడం వంటి చర్యల కారణంగా పురుగులకు, కీటకాలకు నిరోధకత పెరిగిందని ఈ అద్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు.

భారతదేశంతో సహా ఎనిమిది దేశాల్లో 2010 నాటికి శాస్త్రవేత్తలు ఈ విషయంపై అధ్యయనం చేశారు. ఈ అద్యయనంలో 13 ప్రధాన కీటకాల్లో ఐదు కీటకాలు జన్యుమార్పిడి మొక్కజొన్న, పత్తి వంటి పంటలకు నిరోధకతను పెంచుకున్నట్టు తేలింది. మొత్తం 77 అధ్యయనాల సమాచారాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. 2005 నాటికి ఇలా జన్యుమార్పిడి పంటల విషయంలో నిరోధకతను పెంచుకున్న కీటకం ఒకటే ఉండేదట... తర్వాత ఇది ఐదుకు చేరుకుంది. మనదేశంలో పత్తిని ఆశించే శనగపచ్చ పురుగు బీటీ పత్తికి నిరోధకతను పెంచుకుందని 2010 నాటికి క్షేత్రస్థాయిలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అయితే నైరుతి అమెరికాలో ఈ పురుగు నిరోధకతను పెంచుకోలేకపోయిందని, ప్రత్యేకమైన సాగు వ్యూహాన్ని అనుసరించడమే దీనికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే నిరోధకతను పెంచుకున్న ఐదు రకాల కీటకాల్లో మూడు అమెరికాలోనే ఉన్నాయట. ప్రపంచంలో బీటీ పత్తి పండించే విస్తీర్ణంలో సగం విస్తీర్ణం అమెరికాలోనే ఉంది. జన్యుమార్పిడి పంటల్లోని బీటీ ప్రోటీన్లు పంటలను నాశనం చేసే పురుగులను, కీటకాలను నాశనం చేస్తాయి. అయితే ఈ పంటలు పర్యావరణానికి హానికలిగించేలా ఉంటాయని, జనానికి కీడు చేయవని శాస్త్రవేత్తలు చెబుతారు. అయినా ఈ ప్రోటీన్లను విపరీతంగా ఉపయోగించడం వల్ల కీటకాల్లో, పురుగుల్లో నిరోధకత వేగం పెరిగుతుంది. అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన క్యారియర్‌ మాట్లాడుతూ బీటీ పంటల సుస్థిర సామర్ధ్యానికి అనుకూలించే అంశాలేవో తమ అధ్యయనంలో వెల్లడయ్యాయని, జీవ పరిణామ సిద్ధాంతం ఆధారంగా తాము అంచనా వేసుకొచ్చిన అంశాల అనుగునంగానే ఈ అధ్యయనంలో అంశాలు తేలాయని అన్నారు. మనదేశంలో శనగపచ్చ పురుగు బీటీ పత్తి నిరోధకత పొందడానికి, నైరుతి అమెరికాలో నిరోధకత పొందలేకపోవడానికి కారణం సాధారణ రకం పంటల వ్యూహాన్ని అనుసరించడమే కారణమని, నైరుతి అమెరికాలో శాస్త్రవేత్తలు, సాగుచేసేవారు ఈ వ్యూహాన్ని సమర్ధవంతంగా అమలు చేశారని, భారతదేశంలో మాత్రం సరిగా అమలు కాలేదని అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన బ్రూస్‌ తబాష్నిక్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News