: విషాదంలో సంజయ్ దత్ న్యాయవాది


బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ న్యాయవాది రిజ్వాన్ మర్చంట్ కుటుంబాన్ని విధి వక్రీకరించింది. ముంబైలో వారు నివసించే అల్తాఫ్ మ్యాన్షన్ సోమవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆయన భార్య అసిఫా, తల్లి తహీరాలు అక్కడికక్కడే మరణించారు. ఆ సమయంలో రిజ్వాన్ తన పెద్దకుమారుడు, కుమార్తెతో కలిసి తన కార్యాలయంలో ఉన్నారు. శిధిలాల్లో చిక్కుకున్న చిన్నకుమారుడు ఫరాజ్ మంగళవారం మధ్యాహ్నం వరకూ పలు మార్లు తండ్రితో సంభాషించాడు. అతన్ని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో అతను శిధిలాల క్రిందే విగతజీవిగా మారాడు. దీంతో రిజ్వాన్ శోకసంద్రంలో మునిగిపోయాడు. రిజ్వాన్ ను దత్ భార్య మాన్యత, ప్రముఖ న్యాయవాదులు పరామర్శించారు.

  • Loading...

More Telugu News