: ఛలో అసెంబ్లీ నిర్వహించి తీరుతాం: శ్రీనివాస్ గౌడ్
ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఛలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని తెలంగాణ రాజకీయ జేఏసీ నేత శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఛలో అసెంబ్లీని విజయవంతం చేసేందుకు జీహెచ్ఎంసీ ఉద్యోగులతో హైదరాబాద్ లో సమావేశం నిర్వహించిన సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని తెలిపారు. ఉద్యోగులపై కేసులు పెట్టాలని చూస్తే జీహెచ్ ఎంసీలో అత్యవసర సేవలు బంద్ చేస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.