: రాష్ట్రంలో మరో కొత్త పార్టీ


రాష్ట్రంలోకి మరో కొత్త పార్టీ ప్రవేశించనుంది. మంద కృష్ణ మాదిగ అధ్యక్షుడిగా కొత్తపార్టీ పెట్టనున్నట్టు తెలిపారు. జూలై 7న కొత్తపార్టీని ప్రకటించనున్నట్టు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ తెలిపారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరిగిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. గత ముఖ్యమంత్రుల కంటే ఎస్సీ వర్గీకరణ పట్ల కిరణ్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ కృష్ణ మాదిగ, బాబు అసెంబ్లీలో చర్చించడంలో విఫలమయ్యారన్నారు. తాను పెట్టనున్న పార్టీ పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణను గురువారం ప్రకటిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News