: రాగల 48 గంటల్లో భారీ వర్షాలు
రాగల 48 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. అల్పపీడన ద్రోణి ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర తీరం వెంబడి స్థిరంగా కొనసాగుతోంది. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణాలో పలుచోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశముంది.