: హైదరాబాద్ లో అన్నా హజారే
సామాజిక ఉద్యమకారుడు, లోక్ పాల్ బిల్లు రూపకర్త అన్నా హజారే హైదరాబాద్ వచ్చారు. సికింద్రాబాద్ వెస్లీ కళాశాల మైదానంలో ఆదివారం మధ్యాహ్నం జరగనున్న బహిరంగసభలో అన్నా హజారే పాల్గొనున్నారు. ఇందుకోసమే ఆయన శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాదుకు వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు.