: నాప్ టాల్ అసలు రంగు బయటపడింది


ఆన్ లైన్ వస్తు విక్రయసంస్ధ నాప్ టాల్ రంగు బయట పడింది. సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లిలో ఉన్న నాప్ టాల్ గోడౌన్ లో తూనికలు, కొలతల శాఖాధికారులు దాడి చేసారు. ఈ దాడిలో నాప్ టాల్ సంస్ధ మోసాలకు పాల్పడుతున్నట్టు నిర్ధారించారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులకు స్టిక్కర్లు మార్చి అధిక ధరలున్న ట్యాగ్స్ వేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పత్రికలు, టీవీలు, ఇంటర్నెట్లో 5000 రూపాయల ఖరీదైన వస్తువు కేవలం 500 రూపాయలకే అంటూ భారీ స్థాయిలో ప్రకటనలిచ్చి ప్రజలను మోసం చేస్తోందని అధికారులు తెలిపారు. ఈ వస్తువుల ఖరీదు కనీసం 200 కూడా చేయదని తెలిపారు. ఈ సందర్భంగా భారీగా నిల్వలతో బోయిన్ పల్లిలో ఉన్న నాప్ టాల్ గోడౌన్ ను అధికారులు సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News