: భీమిలికి శాటిలైట్ పోర్టు మంజూరు


విశాఖపట్నం జిల్లాలో మరో పోర్టుకు రంగం సిద్దమౌతోంది. డచ్ వారి కాలంలో ప్రముఖ ఓడరేవుగా విలసిల్లిన భీమునిపట్నంకు శాటిలైట్ పోర్టు మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర పెట్టుబడులు, ఓడరేవుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు జన్మదిన వేడుకలకు హాజరయిన గంటా మాట్లాడుతూ, త్వరలోనే భీమిలిలో రెండు బెర్తులతో శాటిలైట్ పోర్టును నిర్మించనున్నామని తెలిపారు. ఈ పోర్టుతో కలిపి విశాఖపట్నంలో మూడు పోర్టులు ఉన్నట్టు లెక్క.

ప్రపంచ ప్రసిద్ది గాంచిన విశాఖపోర్టుకు తోడు గంగవరం పోర్టు, మంజూరైన భీమిలి పోర్టులు విశాఖజిల్లాలో ఉన్నాయి. ఇదిలావుంచితే, విశాఖపోర్టు వల్ల వన్ టౌన్ లో ఉన్న ప్రజల దైనందిన జీవితం దుర్భరంగా మారిందని తక్షణం పోర్టును రద్దు చేయాలంటూ గత కొంతకాలంగా ఆందోళన జరుగుతున్న విషయం విదితమే. వన్ టౌన్ నుంచి వీరిని తరలించాలని పోర్టు అధికారులు కూడా ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకున్నారు.

  • Loading...

More Telugu News