: 20 నిమిషాలు యోగా చేస్తే..
ఆధునిక ప్రపంచంలో ప్రతి విషయంలోనూ మంచీ చెడులు రెండూ కనిపిస్తున్నాయి గానీ, భారతీయ సంప్రదాయమైన యోగా విషయంలో మాత్రం మంచి తప్ప వేరేది వినిపించడం లేదు. ఇప్పుడో కొత్త పరిశోధన మరోసారి అదే విషయాన్ని నిరూపించింది. 20 నిమిషాల పాటు యోగా చేస్తే అమితమైన లాభాలున్నాయంటూ మిచిగాన్ లోని వేన్ యూనివర్సిటీ విద్యార్థులు జరిపిన పరిశోధనలో తేలింది.
ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్ నేహా గోథే ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలో యోగా తెలియని ఓ ముప్పై మంది విద్యార్థినులతో 20 నిమిషాలపాటు యోగా చేయించారు. అంతకుముందు ఉన్న ఆలోచనశక్తిని, యోగా తరువాత వివిధ విషయాల్లో వారిలో పెరిగిన తెలివితేటలను గమనించారు. 'కేవలం 20 నిమిషాల యోగా చేసిన తరువాత, వారి ఆలోచన శక్తిలో పూర్తి మార్పు కనిపించింది. వివిధ పద్ధతులను ఉపయోగించి మేము ఆ విషయాన్ని తెలుసుకున్నాం' అంటూ నేహా వివరించారు.