: శ్రీశాంత్ అభిమానులా... మజాకా!
శ్రీశాంత్ కు ఘనస్వాగతం లభించింది. ప్రాంతీయ అభిమానం మెండుగా ఉన్న మలయాళీలు దేశానికి అప్రదిష్ట తెచ్చి, స్పాట్ ఫిక్సింగ్ లో అరెస్టయి 27 రోజులపాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించి బెయిలుపై విడుదలైన శ్రీశాంతకు బ్రహ్మరధం పట్టారు. తెల్లవారుఝామునుంచే అభిమానులు అతని రాకకోసం పడిగాపులు కాశారు. ఎట్టకేలకు శ్రీశాంత్ 9.15 నిమిషాలకు కొచ్చి చేరుకోవడంతో ఎయిర్ పోర్టులో అతనికి ఘన స్వాగతం పలికారు. శ్రీశాంత్ అభిమానులా మజాకానా?