: అభ్యర్ధులపై కన్నేసిన రాహుల్ గాంధీ
రానున్న ఎన్నికలకు పార్టీలన్నీ ఇప్పట్నుంచే సన్నద్దమౌతున్నాయి. ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చి తన ప్రభావం చాటుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ సన్నద్దమౌతుండగా, వారికి మద్దతిచ్చి, జిల్లానేతల సమీక్షలతో బాబు బిజీబిజీగా గడుపుతున్నారు. కాంగ్రెస్ కూడా తానేమీ తక్కువ తినలేదంటూ పధకాలను ఏకరువు పెడుతోంది. ఇదిలా ఉంచితే, తాజాగా కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ లోక్ సభ అభ్యర్ధిత్వాలపై దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగా మధుసూదన్ మిస్త్రీని రాష్ట్రానికి పంపారు. ఈ నేపధ్యంలో మిస్త్రీ రేపు, ఎల్లుండి గాంధీభవన్ లో జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులతో మంతనాలు జరుపనున్నారు.