: ఈవీఎంలకు కొత్త సొగసులు


ఎన్నికల సంఘం ఇప్పట్నుంచే వచ్చే ఏడాది ఎన్నికలకు రంగం సిద్దం చేస్తోంది. వీలైనంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. గత ఎన్నికల్లో సమర్ధవంతంగా ఈవీఎం లను పరిచయం చేసిన ఎన్నికల సంఘం ఈసారి ఎన్నికల్లో ఈవీఎంలకు కొత్త సొగసులు అద్దనున్నారు. ఓటరు తమ ఓటు ఎవరికి వేశారో తెలిపే విధంగా స్లిప్ లు వచ్చే ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ నిర్ణయంపట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలన్నీ డబ్బులు పంచడం మామూలే. రాజకీయనాయకులు తమ సంపదను వెలికితీసేది ఇప్పడే కనుక కొంతమంది ఓటర్లు అన్నిపార్టీల నుంచీ ముడుపులు స్వీకరిస్తుంటారు. ఇటాంటి స్లిప్ లు వెలికి రావడంతో గొడవలు చెలరేగే అవకాశం ఉంది. అదీకాక అంగ బలం ఉన్నవారి నుంచి పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలోని ప్రజలకు ఈ రకమైన ఇబ్బందులు ఎదురువుతాయిన అంటున్నారు.

  • Loading...

More Telugu News