: వచ్చే ఏడాదే ప్రభాస్ పెళ్లి: కృష్ణంరాజు


టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లిబాజాలు మోగనున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బండి నడిపేస్తున్న ప్రభాస్ వచ్చే ఏడాది పెళ్లి కొడుకు కానున్నాడు. ఇప్పటికే అతని మిత్రబృందం అంతా ఆ కార్యం కానిచ్చేసి, పెళ్లెప్పుడు.. పెళ్లెప్పుడంటూ ప్రభాస్ ని ఆటపట్టిస్తుండడంతో ఈ హీరో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అతనికి తగ్గజోడీని వెదికే కార్యక్రమంలో పెద్దలు బిజీగా వున్నారు. దీంతో వచ్చే ఏడాది అతని పెళ్లి పక్కా అని ఖరారు చేసేశారు అతని పెదనాన్న కృష్ణంరాజు. ప్రభాస్ పెళ్లి వచ్చే ఏడాది ఉంటుందని విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విలేకరులకు తెలిపారు. అలాగే ఆగష్టులో ప్రభాస్ సినిమాకు తాను దర్శకత్వం వహించనున్నట్టు కూడా కృష్ణంరాజు తెలిపారు.

  • Loading...

More Telugu News