: విమాన టికెట్లకూ పాకిన వాయిదాల చెల్లింపు పద్ధతి
రుణం తీసుకుని ఇల్లు కొనుక్కుని ఈఎంఐ విధానంలో నెలా నెలా కొంత బాకీ తీర్చుకుంటూ వెళ్లడం ఎప్పటి నుంచో అమల్లో ఉంది. తర్వాత ఈఎంఐ విధానం, గృహోపకరణాలకు, మొబైల్ ఫోన్లకు వ్యాపించింది. అమ్మకాలు పెంచుకునేందుకు ఈఎంఐ విధానం కంపెనీలకు మంచి ఆయుధంగా మారింది. తాజాగా ఎయిర్ లైన్స్ సంస్థలు కూడా తమ ఆదాయం పెంచుకునేందుకు దీన్ని ప్రవేశపెట్టాయి. డబ్బుల్లేకపోయినా పర్లేదు విమానం ఎక్కేయండి. రెండు నెలల్లో బాకీ తీర్చండి... అంటూ ఈఎంఐ విధానాన్ని ప్రారంభించాయి. విమాన ప్రయాణ చార్జీని రెండు నెలసరి వాయిదాలలో చెల్లించేలా ఇండిగో, జెట్ ఎయిర్ వేస్ సంస్థలు ఈఎంఐ విధానాన్ని ప్రకటించాయి. ఇందుకోసం ఐసీఐసీఐ, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ బ్యాంకు క్రెడిట్ కార్డుంటే చాలు డబ్బుల్లేకపోయినా నింగికెగరవచ్చు.