: నేను బొబ్బులి పులినే: దాసరి నారాయణరావు


తన హయాంలో జరిగిన బొగ్గు కేటాయింపుల అక్రమాలపై దాసరి నారాయణరావు స్పందించారు. ఒక పథకం ప్రకారం తనపై అసత్యప్రచారం చేస్తున్నారని దాసరి నారాయణరావు అన్నారు. నిజానిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని, అంతవరకూ అభిమానులు ఆందోళన చెందకుండా ఓపిక పట్టాలని కోరారు. తాను 'బొబ్బులిపులి'నే అంటూ వ్యాఖ్యానించారు. యూపీఏ-1 హయాంలో దాసరి నారాయణరావు బొగ్గు గనుల శాఖా సహాయమంత్రిగా ఉండగా జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీకి లబ్ది చేకూర్చాంటూ సీబీఐ నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. దాసరి చేసిన మేలుకు ప్రతిఫలంగా ఆయనకు చెందిన సౌజన్య మీడియాలోకి 2.5కోట్ల నిధులు వచ్చాయంటూ అభియోగాలను మోపింది. అనంతరం నిన్న హైదరాబాద్ లోని దాసరి నివాసం, కార్యాలయం, సిరి మీడియా, సౌజన్య మీడియాలో ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరిని కూడా ప్రశ్నించారు. దీనిపై దాసరి ఈ రోజు స్పందించారు. దాసరి వార్తను ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు 'బొగ్గుల పులి' శీర్షికతో ప్రచురించాయి.

  • Loading...

More Telugu News