: టీఆర్ఎస్ ఆందోళనతో రేపటికి వాయిదా పడ్డ శాసనసభ
టీఆర్ఎస్ సభ్యుల ఆందోళనతో శాసనసభ సమావేశాలు మూడోరోజు వాయిదాపడ్డాయి. టీఆర్ఎస్ సభ్యుల ఆటంకాలతో ఉదయం నుంచీ రెండుసార్లు సభ వాయిదా పడింది. సభ తిరిగి మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా టీఆర్ఎస్ సభ్యులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై తీర్మానం కోసం పట్టుబడుతూ స్పీకర్ పోడియం వద్దకు చేరి ఆందోళనకు దిగారు. నినాదాలు చేశారు. స్పీకర్ ఎంతగా అభ్యర్థించినా వారు సహకరించలేదు. దీంతో స్పీకర్ మనోహర్ సభను రేపటికి వాయిదా వేశారు.