: మండేలా త్వరగా కోలుకోవాలని ఒబామా ఆకాంక్ష
దక్షణాఫ్రికా నల్ల సూరీడు, ఆ దేశ మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా(94) ఆరోగ్య పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. తీవ్ర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన నాలుగో రోజూ జోహెన్నెస్ బర్గ్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పైనే ఉన్నారు. పరిస్థితి ఇంకా సీరియస్ గానే ఉందని వైద్యులు ప్రకటించారు. మరోవైపు నెల్సన్ మండేలా త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోవాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆకాంక్షించారు. ఒబామా, ఆయన భార్య మిషెల్లీ సహా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోని ప్రతి ఒక్కరూ నెల్సన్ మండేలా ఆరోగ్య స్థితి పట్ల ఆందోళన చెందుతున్నట్లు అధికార ప్రతనిధి జే కార్నే ప్రకటన జారీ చేశారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.