: ఓప్రావిన్ ఫ్రే భూరివిరాళం
ప్రముఖ టాక్ షో క్వీన్ ఓప్రావిన్ ఫ్రే బోస్టన్ బాంబు పేలుళ్లలో గాయపడిన బాధితులను ఆదుకునేందుకు భూరివిరాళాన్ని ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు ఓప్రా లక్ష డాలర్ల ఆర్ధిక మొత్తాన్ని అందజేసేందుకు సంసిద్దత వ్యక్తం చేసినట్టు డెయిలీన్యూస్ తెలిపింది. ఆమె ఫ్లోరిడా బ్రదర్స్ కు స్వయంగా ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలిపినట్టు డెయిలీ న్యూస్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ లో బోస్టన్ నగరంలో ఏర్పాటు చేసిన మారధాన్ పోటీల్లో ఫినిషింగ్ లైన్ కు కూతవేటు దూరంలో భారీ విస్పోటనం సంభవించింది. ఆ బాంబుపేలుళ్లలో తొలి ముగ్గురూ మృత్యువాత పడగా 264 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరి సహాయార్థం ఓప్రావిన్ ఫ్రే ఈ భూరి విరాళాన్ని అందజేసినట్టు న్యూయార్క్ డెయిలీ తెలిపింది. ఎంతైనా ఓప్రా మనసు వెన్న.