: లోక్ సత్తా అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని జేపీ నిర్ణయం
లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించి కొత్తవారికి, ముఖ్యంగా యువతకు పార్టీలో అవకాశం కల్పించాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే, పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగినా పార్టీ తరపున జాతీయ నాయకుడిగా కొనసాగుతానని జయప్రకాష్ తెలిపారు.