: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్న వ్యక్తి అరెస్టు
ఉగ్రవాద సంస్థలకు నిధులు అందజేస్తున్న వ్యవహారంలో షఫీషా అనే వ్యక్తిని నేషనల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ అరెస్టు చేసింది. జమ్మూకాశ్మీర్ లో పునరావాస ట్రస్టు పేరిట ఉగ్రవాద సంస్థకు షఫీషా నిధులు మళ్లించినట్టు ఎన్ఐఏ గుర్తించింది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు షఫీషా నిధులు మళ్లించినట్లు గుర్తించిన ఎన్ఐఎ అతన్ని అరెస్టు చేసింది. భారత్ లో పలుదాడులకు పాల్పడిన హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ నిషేధిత ఉగ్రవాదసంస్ధ.