: రష్యా ఉల్కాపాతం శక్తి 32 అణుబాంబులతో సమానం : నాసా


రష్యాలో బీభత్సం సృష్టించిన ఉల్కాపాతం శక్తి దాదాపు 32 అణు బాంబులతో సమానమని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. 55 అడుగుల వెడల్పు, పదివేల టన్నుల బరువున్న ఈ ఉల్క రష్యా తూర్పు భాగంలోని యూరల్స్ ప్రాంతంలో నిప్పులు విరజిమ్మింది. ఆకాశంలోంచి పడుతున్న అగ్ని కీలల్ని చూసి ప్రజలు భయంతో పరుగులు తీశారు. 

ఉల్కాపాతం ధాటికి 1200 మంది ప్రజలు గాయపడగా, వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. దాదాపు మూడు నిమిషాలపాటు ఆ చుట్టుపక్కల సమాచార వ్యవస్థ కూడా పనిచేయలేదని స్థానికులు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ లోని హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు కంటే ఈ ఉల్కపాతం 32 రెట్లు ఎక్కువ ప్రభావం చూపిందని నాసా తెలిపింది. ప్రస్తుతం వందలమంది బాధితులను సహయక సిబ్బంది రక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News