: తెలంగాణపై అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తా: కిరణ్ కుమార్ రెడ్డి


తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించినట్లు ఆయన తెలిపారు. అలాగే సున్నితం, జఠిలం అయిన తెలంగాణ సమస్యపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు ముఖ్యమంత్రి చెప్పారు.  

రాహుల్ గాంధీతో రెండు రోజుల భేటీ అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు, తనకు మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఉత్పత్తికి అదనపు గ్యాసు ఇప్పించాల్సిందిగా కేంద్రాన్ని కోరామనీ, రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు నిధులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా తెలిపినట్లు ఆయన చెప్పారు. 

రైతుల రుణాలను మాఫీ చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలపై కిరణ్ మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్టే లక్షా 50 వేల కోట్లు.. రైతుల రుణాలు లక్షా 16 వేల కోట్లని ముఖ్యమంత్రి అన్నారు. మరి, ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా రుణ మాఫీ చేయగలదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసే అవకాశం ఉందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.  అయితే ఇప్పటికే ఈ సంవత్సరం కేంద్రం 5 లక్షల 75 వేల కోట్ల రూపాయలు రైతులకు అప్పులు ఇచ్చిందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News