: శ్రీలంక జాతీయగీతం స్థానంలో హిందీ సాంగ్
చాంపియన్స్ ట్రోపీ ప్రారంభ వేడుకల్లో శ్రీలంక జాతీయగీతం వినిపించాల్సిన చోట హిందీ పాటను ప్రసారం చేశారంటూ ఆ దేశంలోని 'రావణ బలయ' అనే సంస్థ మండిపడుతోంది. ఈ సంఘటనపై సమాధానం చెప్పాలంటూ శ్రీలంక క్రికెట్ కౌన్సిల్ కార్యాలయం ఎదుట రావణ బలయ ఆందోళన చేపట్టింది. 'ఇది పూర్తిగా శ్రీలంక క్రికెట్ కౌన్సిల్ బాధ్యతారాహిత్యమే. ఈ సంఘటనపై వారు దేశానికి సమాధానం చెప్పాలి' అంటూ రావణ బలయకు చెందిన సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.