: సెలవు తీసుకున్న ప్రపంచపు పెద్దావిడ!
ప్రపంచంలోనే అతి ఎక్కువ వయసు మహిళగా చైనా అధికారులు చెబుతున్న ఓ చైనా వృద్దురాలు ఈ రోజు చనిపోయింది. అయితే ఆమె వయసును అంతర్జాతీయ అధికారులు అంగీకరించడం లేదు. "127 సంవత్సరాల వయసున్న లుయో మీజన్ అనే మా బామ్మ ఈ రోజే మరణించింది" అంటూ ఆమె మనవడు హుయాంగ్ హుయాన్ తెలిపారు. అయితే, ఆమె జన్మించిన కొన్ని దశాబ్దాల తరువాత గానీ చైనాలో సక్రమమైన జననాల నమోదు ప్రక్రియ ప్రారంభం కాలేదని గిన్నిస్ బుక్ అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో చైనా ఆ వృద్దురాలి అసలైన బర్త్ సర్టిఫికెట్ ఇవ్వలేకపోయిందని చెబుతున్నారు.