: తెలంగాణ ఇప్పుడప్పుడే తేలదు: షిండే


తెలంగాణ ఇప్పడప్పుడే తేలేది కాదని తెలంగాణపై కేంద్ర హోం శాఖా మంత్రి షిండే సంచలన వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో షిండే మాట్లాడుతూ తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోందని తెలిపారు. తెలంగాణపై ఏకాభిప్రాయం లేనందున నిర్ణయం వెల్లడించలేకపోతున్నామన్నారు. తెలంగాణపై నిర్ణయం పార్లమెంటు సమావేశాల తరువాతా, లేదా అసెంబ్లీ సమావేశాల తరువాతా అనేది చెప్పలేమని, తెలంగాణ సమస్యకు టైం కచ్చితంగా చెప్పలేమన్నారు. త్వరలోనే మళ్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, ఏకాభిప్రాయం దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News