: టెక్ మహీంద్రాలో సత్యం కంప్యూటర్స్ విలీనానికి హైకోర్టు పచ్చజెండా
సత్యం కంప్యూటర్స్ సంస్థను టెక్ మహీంద్రా సంస్థలో విలీనం చేసేందుకు రాష్ట్ర హైకోర్టు నేడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సత్యం అధినేత రామలింగరాజు ఆర్ధిక అవకతవకలకు పాల్పడినట్టు అంగీకరించడంతో సంస్థను టెక్ మహీంద్రాకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2009లో రామలింగరాజు వ్యవహారం వెలికిచూడగా, అనంతరం ఆయన జైలుపాలయ్యారు. ఇటీవలే బెయిల్ లభించడంతో విడుదలయ్యారు.