: మిత్రుల మధ్య హోరాహోరీ పోరు
ఛాపింయన్స్ లో హోరాహోరీ సమరానికి టీమిండియా, విండీస్ జట్లు సిద్దమయ్యాయి. మైదానంలో దిగేందుకు రెండు టీం లు సై అంటున్నాయి. విండీస్, టీమిండియాలోని ఆటగాళ్ళు అందరికీ ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలుసు. ఒకరి బలహీనతలు, బలాలు తెలిసిన ఆటగాళ్లు రెండు జట్లలోనూ ఉన్నారు. ప్రత్యర్ధులుగా ఢీకోబోతున్న ఆటగాళ్లంతా మైదానం బయట మంచి మిత్రులు. బలాబలాలు తెలిసిన ప్రత్యర్ధులు ఒకరికొకరు ఎదురవ్వబోతుంటే మ్యాచ్ పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. విండీస్ లో అందరూ మ్యాచ్ విన్నర్లే కానీ, సమర్ధవంతుడైన ప్రత్యర్ధి ఎదురైతే ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం ఈ మ్యాచ్ చూడాల్సిందే.
టీట్వంటీల్లో ప్రతిభావంతులు విండీస్ ఆటగాళ్లు. ఫార్మాట్ ఏదైనా తమను తాము ఫార్మాట్ కు తగ్గట్టు మార్చుకునే ఆటగాళ్లు టీమిండియన్లు. మరో వైపు భారీ షాట్లకు పెట్టింది పేరు విండీస్ వీరులు. కళాత్మకమైన క్రికెట్ కు సాక్ష్యం టీమిండియా సాహసవంతులు. అందుకే రెండు జట్లలో ఎవరు నెగ్గుతారంటే బుకీలు సైతం బెట్టింగ్ కు తడబడే రెండుజట్ల మధ్య రసవత్తరమైన పోరు కాసేపట్లో ఆరంభమవనుంది. ఏదీఏమైనా టీమిండియానే ఫేవరేట్. టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది.