: పాక్ తోక వంకర!
కుక్క తోక వంకర.. పాకిస్తాన్ తీరు అంతకంటే వంకర. సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమల్లో ఉన్నా పదేపదే ఒప్పందాలను ఉల్లంఘించడం పొరుగుదేశానికి పరిపాటే. ఈ క్రమంలో జమ్ముకాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో మరోసారి కాల్పులకు తెగబడింది. గత నాలుగు రోజుల్లో పాక్ కాల్పులు జరపడం ఇది రెండోసారి. గతరాత్రి సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పలు భారత సైనిక స్థావరాలపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు. అయితే, ఎవరికీ గాయాలవలేదని రక్షణ శాఖ ప్రతినిధి ఎస్ఎన్ ఆచార్య తెలిపారు. వారు తేలికపాటి ఆయుధాలతో దాడికి దిగినట్టు ఆయన వెల్లడించారు. కాగా, ఈనెల 7న పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో భారత అధికారి ఒకరు మరణించిన సంగతి తెలిసిందే.