: బ్యాంకు ఉద్యోగి కీబోర్డుపై తలవాల్చితే ఏమవుతుంది?


అలసటగా అనిపించినప్పుడు కంప్యూటర్ ముందే తలపెట్టి సేదతీరే ఉద్యోగస్తులను చూస్తుంటాం. అలాంటి సమయంలో కీబోర్డు అక్షరాలు ప్రెస్ అయి ఫైల్స్ డిలేట్ అయిపోవడం, సిస్టంలో రకరకాల విన్యాసాలు జరిగి నానా ఇబ్బందులు పడడం మనం చూస్తుంటాం. అయితే ఇలాగే జర్మన్ దేశంలోని ఓ బ్యాంక్ ఉద్యోగి చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవాల్సిందే. ఓ వ్యక్తి ఖాతాలో కొద్ది మొత్తంలో డబ్బులు జమ చేస్తున్న సమయంలో ఆ ఉద్యోగి అలసట భారంతో అలాగే డెస్క్ పై తలపెట్టి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆయనగారి తల కీ బోర్డుపై పడి 293 మిలియన్ డాలర్ల నగదు సదరు వ్యక్తి ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇది జరిగిన చాలాసేపటి తరువాత లెక్కల్లో తేడాలొచ్చి చూడగా జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించి సమస్యను పరిష్కరించుకోగా, ఘనకార్యం చేసిన ఉద్యోగి మాత్రం కోర్టు మెట్లు ఎక్కక తప్పలేదు. అయితే కోర్టు గట్టి మొట్టికాయలు పెట్టి వదలిపెట్టడంతో హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నాడా ఉద్యోగి.

  • Loading...

More Telugu News