: సంక్షోభం లేదు.. ఐక్యంగానే ఉన్నాం: సుష్మాస్వరాజ్
అద్వానీ రాజీనామాతో బీజేపీలో సంక్షోభం నెలకొందంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ పార్లమెంటరీ నేత సుష్మా స్వరాజ్ ఖండించారు. పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదని, తామంతా కలసికట్టుగానే ఉన్నామని చెప్పారు. అద్వానీ ఆశీస్సులతో ముందుకు వెళతామని తెలుపుతూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.