: ఆటగాళ్ల ఆటకట్టించేందుకు 12 పాయింట్ల ఫార్ములా


స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్, క్రికెటర్లపై పలు వివాదాల నేపథ్యంలో ఐపీఎల్ ను ప్రక్షాళించాలని బీసీసీఐ నిర్ణయించింది. తాత్కాలిక అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఆధ్వర్యంలో ఇందుకోసం 12 పాయింట్ల ఫార్ములాతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఐపీఎల్ లో చీర్ గర్ల్స్ కు మంగళం పాడడం, మ్యాచ్ అనంతరం ఆటగాళ్ల తానతందానలపై నిషేధం విధించడం ముఖ్యమైనవి. అలాగే మ్యాచ్ సమయాల్లో ఫ్రాంచైజీ యజమానులు ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూములవైపు వెళ్లకూడదు. మ్యాచ్ కు ముందే ఆటగాళ్లు, వారి సిబ్బంది తమ ఫోన్లను బీసీసీఐకి ఇవ్వాలి. మ్యాచ్ జరిగే సమయాల్లో స్టేడియంలో సెల్ ఫోన్లు పనిచేయకుండా జామర్లు ఏర్పాటు చేయనున్నారు. ఆటగాళ్లు ఇయర్, మైక్రోఫోన్లు వాడరాదు. జాతీయ సెలక్టర్లకు ఫ్రాంచైజీలతో సంబంధాలు ఉండకూడదు. ఇలాంటివే మరికొన్ని ఉన్నాయి. వీటిని అమలు చేయాలని నిన్న జరిగిన బీసీసీఐ సమావేశంలో నిర్ణయించారు. అప్పుడు ఆటగాళ్ల తప్పుడు ఆటలకు కళ్లెం పడుతుందని బీసీసీఐ భావిస్తోంది.

  • Loading...

More Telugu News