: ఆమ్మాయిలకు సెల్ వద్దు : బీజేపీ నేత


చేతిలో మొబైల్ లేని అమ్మాయిని ఊహించగలమా..? జీన్స్ వేయొద్దంటే నేటి తరం అమ్మాయిలు ఊరుకుంటారా.. కానీ ఈ రెండే స్త్రీలపై అరాచకాలు జరగడానికి కారణమంటున్నారు బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు రఘునందన్ శర్మ. మధ్యప్రదేశ్ లోని రాట్లాం జిల్లాలో బ్రాహ్మణుల సమావేశంలో శర్మ మాట్లాడుతూ "యువత, ముఖ్యంగా అమ్మాయిలు మొబైల్ ఉపయోగించడం మంచిది కాదు. వారిపై అరాచకాలు జరగడానికి మొబైల్ కల్చర్ ఓ కారణమవుతోంది. అలాగే స్త్రీలు జీన్స్ వేసుకోవడం మానుకోవాలి. అమెరికన్ కౌబాయ్ కల్చర్ అయిన జీన్స్ మన భారతీయ సంప్రదాయానికి సరిపోవు" అంటూ చెప్పుకొచ్చారు శర్మ. అయితే ఈ అభిప్రాయాలు తనవి మాత్రమేననీ, పార్టీకి దీనితో సంబంధం లేదన్నారు శర్మ.

  • Loading...

More Telugu News