: అద్వానీతో మరో రౌండ్..


మోడీకి పట్టం కట్టడంపై అలకబూనిన అగ్రనేత అద్వానీని బుజ్జగించేందుకు బీజేపీ నాయకులకు తలప్రాణం తోకకు వస్తోంది. అద్వానీ ఉన్నట్టుండి రాజీనామా చేయడంతో అగ్రనాయకులంతా నిన్న ఆయన నివాసానికి క్యూకట్టారు. వెంకయ్యనాయుడు, వీకే మల్హోత్రా, సుష్మాస్వరాజ్ తదితరులు అద్వానీని కలిసి రాజీనామా ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఆయన తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. చేసేది లేక ఆ నాయకులంతా, మరోసారి ఈ రాజకీయ భీష్ముణ్ణి కలవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, బల్బీర్ పుంజ్.. అద్వానీని కలిశారు. నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News