: గేల్ ఉంటే విజయం లేదు: ధోనీ


వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ క్రీజులో ఉంటే విజయంపై ఆశలు వదులుకోవాల్సిందేనని అంటున్నాడు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. చాంపియన్స్ ట్రోపీలో ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ లో గేల్ లాంటి ఆటగాళ్లతో జాగ్రత్తగా ఉండాలంటున్నాడు ధోని. 'క్రిస్ గేల్ లాంటి ఆటగాళ్లను ఎంత త్వరగా ఔట్ చేస్తే అంత మంచిది. ఏ మాత్రం తేడా వచ్చినా మ్యాచ్ ను అతి సులభంగా మన దగ్గర నుంచి తీసుకుపోగలరు' అంటూ అభిప్రాయపడ్డాడు ధోని. కాగా ఈ మ్యాచులో విజయం సాధించిన జట్టు సెమీస్ బెర్తుకు అతి చేరువగా నిలుస్తుంది.

  • Loading...

More Telugu News