: అందులో చైనా ప్రధమస్థానం!


వాతావరణంలో కర్బన ఉద్గారాలు ఎక్కువయ్యే కొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. అయితే ఇలాంటి కర్బన ఉద్గారాలను విడుదల చేయడంలో చైనా ప్రథమ స్థానంలో ఉందని తేలింది. 2012లో ప్రపంచ వ్యాప్తంగా కర్బన ఉద్గారాలు, అవి వాతావరణ పరిస్థితులపై చూపే ప్రభావాలను గురించి ఐఈఏ సోమవారం నాడు ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో అధిక మొత్తంలో కర్బన ఉద్గారాలను విడుదల చేసే దేశాల్లో చైనా ప్రథమంగా నిలిచింది. గతంలో అమెరికా కర్బన ఉద్గారాలకు కేంద్రంగా నిలిచింది. ఇప్పుడు చైనా ఆ స్థానాన్ని ఆక్రమించింది.

గతంలో అధిక మొత్తంలో కర్బన ఉద్గారాలను విడుదల చేసిన అమెరికా తర్వాత గ్యాస్‌ ఆధారిత విద్యుత్తును పెద్ద ఎత్తున ప్రోత్సహించి, కర్బన ఉద్గారాల విడుదలను 20 కోట్ల టన్నులకు పరిమితం చేసుకుంది. చైనాలో ఇది 30 కోట్ల టన్నులుగా తేలింది. అయితే గత ఏడాదితో పోలిస్తే చైనాలో కార్బన్‌డయాక్సైడ్‌ పెరుగుదల 3.8 శాతంగా నమోదయింది. గత పదేళ్లతో పోలిస్తే ఇది అత్యల్ప నమోదు. దీనికి కారణం ఆదేశం కాలుష్య రహిత ఇంధనాల వాడకాన్ని భారీ ఎత్తున చేపట్టడమేనని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) చెబుతోంది. కాగా 2011లో సంభవించిన పుకుషిమా అణుధార్మిక కేంద్రంలోని ప్రమాదం వల్ల జపాన్‌లో ఈసారి ఏడుకోట్ల కర్బన ఉద్గారాలు విడుదలయ్యాయని ఐఈఏ చెబుతోంది.

కాగా ప్రపంచవ్యాప్తంగా 3,160 కోట్ల టన్నుల మేర కర్బన ఉద్గారాలు విడుదలయ్యాయని, వీటివల్ల ఉష్ణోగ్రతలు సగటున 3.6 నుండి 5.3 సెల్సియస్‌ మేర పెరిగే అవకాశం ఉందని, దీని ఫలితంగా వరదలు, దుర్భిక్షాలు, వాతావరణంలో విపరీతమైన మార్పులు ఏర్పడే అవకాశం ఉందని ఈ సంస్థ హెచ్చరిస్తోంది. ఈ శతాబ్దానికి ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చూడాలని సంస్థ చెబుతోంది.

  • Loading...

More Telugu News